Header Banner

నటుడు పృథ్వీరాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు! వైకాపా వింగ్ వేధింపులే ..!

  Wed Feb 12, 2025 20:50        Others

రెండ్రోజులుగా వైకాపా సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) కుటుంబ సభ్యులతో వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్కాల్స్, మెస్సేజ్లతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ.. "నా నెంబర్ సోషల్ మీడియా గ్రూప్లో ఉంచి 1800 కాల్స్ చేయించారు. మా అమ్మ, భార్య, పిల్లలను తిట్టించారు. వారి వేధింపులు తాళలేక ఆసుపత్రిలో చేరా. అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో ఫిర్యాదు చేశా. త్వరలో ఏపీ హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తా.


ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 


నన్ను వేధించిన వారిపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాం" అని తెలిపారు. ‘లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ సినిమా వేడుకలో.. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని పృథ్వీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆ సినిమాని బాయ్కాట్ చేయాలంటూ వైకాపా వింగ్.. సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రమే 'లైలా'. ఆకాంక్ష శర్మ హీరోయిన్. అందులో పృథ్వీ ఓ పాత్ర పోషించారు. సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #socialmedia #harassment #cineactor #police #complaint #todaynews #flashnews #latestupdate